ప్రభాస్ “రాధే శ్యామ్” గ్లింప్స్…విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్!

Sunday, February 14th, 2021, 03:16:29 PM IST

ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారికి ఆ గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర యూనిట్. రాధే శ్యామ్ చిత్రం గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్ లో మునిగి తేలే ప్రభాస్ ను మళ్ళీ చాలా రోజుల తర్వాత తెరపై చూడబోతున్నాం. ఈ చిత్రం లో ప్రభాస్ రొమాంటిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. అయితే టీజర్ లో పూజ హెగ్డే లుక్ సైతం సూపర్బ్ అనేలా ఉంది. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అంటూ పూజ హెగ్డే అడగగా, ఛా, వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు అంటూ చెప్పిన డైలాగ్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

అయితే ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14 న ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. అయితే టీజర్ తో పాటు ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నాం అనేది ప్రకటించేసింది. ఈ చిత్రాన్ని జూలై 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రభాస్ డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ చిత్రం తెలుగు తో పాటుగా, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియన్ మూవీ గా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే.