శ్రీకారం చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ – ప్రభాస్

Thursday, March 11th, 2021, 03:42:22 PM IST

మహ శివ రాత్రి సందర్భంగా విడుదల అయిన చిత్రాల్లో శ్రీకారం ఒకటి. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహనన్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం పై అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కిషోర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. అయితే తాజాగా ఈ చిత్రం పై యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ స్పందించారు. నా ప్రియ సోదరుడు శర్వానంద్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. శ్రీకారం సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అంటూ ప్రభాస్ అన్నారు. అయితే ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ను శర్వానంద్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అయితే ఈ సినిమా పై అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రీ రిలీజ్ వేడుక లో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ సైతం దీని పై స్పందించడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. రైతు కొడుకు రైతు కావడం లేదు అనే అంశం తో తెరకెక్కిన ఈ శ్రీకారం పై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో పక్క ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర పోస్టర్ ను చిత్ర యూనిట్ శివరాత్రి పండుగ సందర్భంగా విడుదల చేసింది.