ప్రభాస్ అభిమానులకు ఆ పండుగ ఎపుడు వస్తుందో?

Thursday, March 26th, 2020, 10:43:03 PM IST

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇప్పటివరకు ఆ చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ఫస్ట్ లుక్, టీజర్, తదితర విషయాల పై నెటిజన్లు, అభిమానులు ఆరా తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ ఉన్నప్పటికీ తమ అభిమానులని అలరించడానికి స్టార్ హీరోలు ఏదో ఒక పనిలో నిమగ్నమై తమ అభిమానుల్ని సంతోష పెడుతున్నారు. అయితే ఈ చిత్రం పై ఇప్పటికే అభిమానులు పూజ హెగ్డే నీ సైతం అడగడం మొదలు పెట్టారు. అయితే దానికి పూజ హెగ్డే తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.

ఫస్ట్ లుక్, టీజర్ విడుదల ఎపుడు అని పూజ నీ అడగగా అందుకు బదులు పూజ ఇలా సమాధానం ఇచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడిని అడగండి అంటూ తెలివిగా తప్పించుకుంది. అయితే ఇటీవల దర్శకుడు సైతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నీ త్వరలో విడుదల చేయనున్నాం అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కమెడియన్ ప్రియదర్శి సైతం ప్రభాస్ ఫస్ట్ లుక్ సూపర్ అని వ్యాఖ్యానించారు. మరి ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో ఏమో.