ప్రభాస్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి!

Friday, October 23rd, 2020, 10:22:39 AM IST

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీగా సంబరాలు జరుపకుంటున్నారు. అయితే ఆ సంబరాల్లో ఒక వ్యక్తి ప్రభాస్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ కి గురి అయి మృతి చెందాడు. అతనితో పాటుగా ఇంకో నలుగురు యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు అయ్యారు. అయితే ఈ ఘటన ప్రకాశం జిల్లా లోని యద్దనపూడి మండలం, పునూర్ లో చోటు చేసుకుంది.

పూనూర్ లో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీ కడుతుండగా, విద్యుత్ షాక్ తో వంకాయలపాటి సుగుణ రావు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ నలుగురు బేతపూడి వాసు, చింతల వాసు, ఉసిరిపాటి అసిరి, వంకాయల పాటి సుమంత్ లు గా స్థానికులు చెబుతున్నారు. అయితే వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తో పూనూరు లో విషాదం చోటు చేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా వ్యక్తి మృతి చెందడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.