కరోనా టైమ్ లో ఖైరతాబాద్ లో ప్రభాస్…ఎందుకంటే!?

Friday, August 7th, 2020, 01:07:12 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క సారిగా ఖైరతాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. కొత్తగా తను కొనుక్కున్న వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఆర్టీఏ కార్యాలయం కి వెళ్లారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయం కావడం తో మాస్క్ తో కనిపించారు ప్రభాస్. అయితే అక్కడ ఉన్న కొందరు సిబ్బంది మరియు అభిమానులు ప్రభాస్ ను గుర్తు పట్టగా, సేల్ఫి లు సైతం దిగారు. అయితే ప్రభాస్ మాస్క్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అయితే ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఇటీవల విడుదల అయింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి ఆదరణ లభించగా, పూజ హెగ్డే ఈ చిత్రం లో కథానాయిక గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం పూర్తి కాకముందే ప్రభాస్ మరొక చిత్రాన్ని అంగీకరించారు. మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లో ప్రభాస్ నటిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. బాహుబలి తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్. అప్పటినుండి భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే చేస్తున్నారు.