సలార్: ప్రభాస్ అభిమానులకి కావాల్సింది ఇదేగా

Wednesday, December 2nd, 2020, 03:27:34 PM IST


యంగ్ రెబల్ స్టార్ మరొక పాన్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కన్నడ సినీ పరిశ్రమ కి చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రం తో సౌత్ ఇండియా లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసారు. అయితే ఈ చిత్ర సీక్వెల్ కోసం కన్నడ సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేయనున్నారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ అంటూ ప్రభాస్ తో చేయనున్న సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

సలార్ భారీ యాక్షన్ చిత్రం గా తెరకెక్కనుంది. ది మోస్ట్ వయోలేంట్ మెన్…కాల్డ్ వన్ మ్యాన్… ది మోస్ట్ వయోలేంట్ అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. అన్ని భాషల మద్యన ఉన్న తారతమ్యాలను చెరిపేస్తూ, ఇండియన్ మూవీ గా ప్రభాస్ ను సలార్ లో చూపించనున్నారు ప్రశాంత్. హాంబలే ఫిల్మ్స్ లోకి స్వాగతం అంటూ ప్రభాస్ కి వెల్కమ్ చెప్పారు ప్రశాంత్.

యశ్ ను ఎంతో మాస్ లుక్ తో ఒక రేంజ్ లో ఎలివెట్ చేసిన ప్రశాంత్, ప్రభాస్ ను అంతకు మించి చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ లుక్ కూడా పోస్టర్ లో అడ్డిరిపోయింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులకు కావాల్సింది ఇదే అంటూ కొందరు కమెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రం లో నటిస్తుండగా, నాగ్ అశ్విన్ తో ఒక చిత్రం, ఓం రౌత్ తో ఆదిపురుష్ లతో పాటుగా ఈ చిత్రం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్.