బిగ్ అనౌన్స్‌మెంట్: ‘ఆదిపురుష్’ అంటూ వచ్చేశాడోచ్..!

Tuesday, August 18th, 2020, 08:42:03 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మనముందుకు రాబోతున్నాడు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్రభాస్ ఫీట్ పూర్తిగా మారిపోయింది. ఇప్ప‌టికే రాధే శ్యామ్ అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్, మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ పీరియాడిక‌ల్ మూవీ చేయ‌నున్నాడు.

అయితే గ‌త రాత్రి ప్ర‌భాస్ త‌న ఫ్యాన్స్‌కి మేజ‌ర్ అప్‌డేట్ ఇస్తానని చెప్పాడు. అన్నట్టుగానే సరిగ్గా 7:11 నిమిషాలకు మ‌రో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. “తనాజీ” దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే భారీ ప్రాజెక్ట్ ను చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్‌ని కూడా విడుద‌ల చేశారు. ఇందులో “A” అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు, పది తలల రావణుడుని కూడా ఉంచారు. ఈ పిక్ షేర్ చేస్తూ చెడు మీద మంచి గెలుపును సెలబ్రేట్ చేస్తూ అని ఒక కామెంట్ రాశాడు ప్రభాస్.