హాట్ టాపిక్: ప్రభాస్ 21 నుండి మరో బిగ్ అప్డేట్

Thursday, October 8th, 2020, 08:49:58 PM IST

ప్రభాస్ హీరోగా, దీపికా పడుకొనే హీరోయిన్ గా తెరకెక్కెందుకు సిద్దంగా ఉన్న చిత్రం ప్రభాస్21. ఇంకా టైటిల్ ను సైతం చిత్ర యూనిట్ ప్రకటించలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరెక్కబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక ప్రకటన చిత్ర యూనిట్ తెలిపింది.

రేపు అనగా అక్టోబర్ 9 వ తేదీన ఉదయం పది గంటలకు ఒక బిగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అయితే టైటిల్ లేదా ప్రభాస్ లుక్ పై ఈ అప్డేట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే అప్డేట్స్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన. అనంతరం నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ చేస్తున్నారు.