ఇంట్లోనే ఉన్నా కరోనా సోకింది…పాప్ సింగర్ స్మిత

Tuesday, August 4th, 2020, 11:09:41 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇప్పటికే రాజమౌళి, తేజ లకు కరోనా సోకగా, తాజాగా పాప్ సింగర్ స్మిత కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా స్మితా నే వెల్లడించారు. నిన్న పిచ్చి పిచ్చిగా , చిరాగ్గా ఉంటే, వర్క్ ఔట్స్ వలన అని అనుకున్నా అని, అయితే ఎందుకైనా మంచిదని కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నాం అని అన్నారు.

అయితే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో ఆమె భర్త శశాంక్ కి మరియు తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని అన్నారు. అయితే వారు ఇద్దరు కూడా ఇంట్లో నే ఉన్నప్పటికీ కరోనా వైరస్ సోకడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఒక ఎలక్ట్రీషియన్ వచ్చినట్లు తెలిపారు. ఒక వేళ అతని ద్వారా కరోనా వైరస్ సోకి ఉంటుందేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ వైరస్ భారీ నుండి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.