భారీగా రెమ్యూనేషన్ పెంచేసిన పూజ హెగ్డే!

Wednesday, July 29th, 2020, 02:08:03 AM IST


ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారు అంటే పూజ హెగ్డే అని చెప్పాలి. ఈ ఏడాది అలా వైకుంఠ పురం లో చిత్రం తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దు గుమ్మ ఇపుడు ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తో పాటుగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కూడా పూజ హెగ్డే నే హీరోయిన్. అయితే ఈ ముద్దు గుమ్మ కి బాలీవుడ్ లో సైతం వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర షూటింగ్స్ ఆగిపోయిన పూజ హెగ్డే కి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అందుచేత పూజ హెగ్డే తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చెక్కర్లు కొడుతుంది. అలా వైకుంఠ పురం లో చిత్రం కోసం పూజ హెగ్డే 1.4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా, ఇపుడు ఆ పారితోషికాన్ని 2 కోట్ల రూపాయల కి పెంచేశినట్లు సమాచారం. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా అందరూ తమ రెమ్యునరేషన్ లను తగ్గిస్తుండగా, పూజ హెగ్డే మాత్రం ఇలా పెంచడం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. కొందరు మాత్రం దీపం ఉన్నపుడే చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా, పాపులారిటీ ఉన్నపుడే రెమ్యునరేషన్ పెంచే యాలి అని భావిస్తున్నారు.