పవన్ పక్కన స్టెప్పులేసే అవకాశం దక్కించుకున్న పూజా హెగ్డే?

Tuesday, January 14th, 2020, 02:00:48 AM IST

పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అవకాశం అనగానే ఎగిరి గంతేసే హీరోయిన్లు చాలామంది వున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటించనున్నారనే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ పలువురు దర్శకనిర్మాతలు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం పలువురిని సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే అందులో పూజ హెగ్డే పేరు వున్నట్లుగా సమాచారం.

పింక్ రీమేక్ లో పవన్ కి తగ్గట్లుగా ఒక సాంగ్ ని కూడా కంపోజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో డ్యూయెట్ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలో అని నిర్మాతలు ఆలోచిస్తుండగా పూజ హెగ్డే గురించి ఆలోచించారట. వరుస సినిమాల విజయాల తో దూసుకుపోవడం మాత్రమే కాకుండా, పూజ హెగ్డే ప్రత్యేక పాటలకు, చిన్న పాత్రలకు కూడా ఒప్పుకుంటుంది అని గతంలో తాను చేసిన సినిమాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మరి పవన్ సరసన స్టెప్పులేసే అవకాశం పూజ హెగ్డే ని వరిస్తుందో లేదో చూడాలి.