సౌత్ ఇండస్ట్రీపై చీప్ కామెంట్స్ చేసిన పూజా హెగ్ధే..!

Saturday, November 7th, 2020, 02:11:42 AM IST


సౌత్ ఇండస్ట్రీపై హీరోయిన్ పూజా హెగ్ధే చీఫ్ కామెంట్స్ చేసి తీవ్ర విమర్శల పాలవుతుంది. ప్రస్తుతం పూజా హెగ్ధె టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. మన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస ఆఫర్లు ఇస్తుంటే, అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. అయితే ఆమె మాత్రం ఇక్కడి వాళ్లకు నడుము పిచ్చి ఉందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళిన పూజా అక్కడ కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తుంది. అయితే తెలుగులో కూడా ప్రభాస్‌తో రాధే శ్యామ్, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తుంది. అయితే ఇక మీదట తన ఫోకస్ అంతా హిందీ సినిమాలపైనే అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కారణంతోనే దక్షిణాది ఇండస్ట్రీనీ తక్కువ చేసి మాట్లాడుతుందేమో అని పూజపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక్కడి ఆడియన్స్‌పై పూజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దక్షిణాది ప్రేక్షకులకు నడుము చూసే అలవాటు ఉందని, వాళ్లంతా అదే మత్తులో ఉంటారని చెప్పుకొచ్చింది. ఇన్ని రోజులు కోట్లకు కోట్లు తీసుకుని బాగానే నడుము చూపించావు కదా ఇప్పుడు ఎందుకు అలాంటి చీఫ్ కామెంట్ లు చేస్తున్నావు అంటూ దక్షిణాది ప్రేక్షకులు మండిపడుతున్నారు.