అల్లు అర్జున్, ప్రభాస్ ల గురించి పూజ హెగ్డే ఏమన్నారో తెలుసా?

Wednesday, January 15th, 2020, 02:20:16 AM IST

వరుస హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో వున్నా పూజ హెగ్డే తాజాగా అల్లు అర్జున్, ప్రభాస్ ల గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించారు. అలా వైకుంఠపురంలో చిత్రం విజయానందం తో ఉన్న పూజ హెగ్డే ఈ చిత్రంలో చేసిన అమూల్య పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెబుతుంది. బన్నీ తో మళ్ళి మళ్ళి నటించాలని వుంది అని చెబుతుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అల్లు అర్జున్ నా ఫెవరెట్ స్టార్, ప్రభాస్ తో ఎక్సపీరియెన్స్ చాల బాగుంది అని పూజ హెగ్డే తెలిపింది. కాకపోతే అల్లు అర్జున్ తో గతంలో దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో నటించడం ద్వారా అల్లు అర్జున్ తో మళ్ళి నటించడం పట్ల చాల కంఫర్ట్ గా ఉంది అని తెలిపింది. అయితే అలా కంఫర్ట్ గా నటించడం వలనే తెరపై కెమిస్ట్రీ చాల బాగా పండింది అని తెలిపింది. అయితే అల్లు అర్జున్ కూడా పూజ హెగ్డే తో మళ్ళి నటించడానికి ఓకే అన్నట్లుగా తెలిపిన సంగతి తెలిసిందే.