దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు..!

Sunday, July 5th, 2020, 02:38:25 AM IST


వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. మర్డర్ సినిమా నిర్మాత కరుణ మరియు వర్మపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

అయితే రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా మర్డర్ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ అని వార్తలు కూడా వినబడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమా తన కుమారుడు ప్రణయ్ హత్యకేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రణయ్ తండ్రి బాల స్వామి SC,ST కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆదేశాలతో వర్మపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.