మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Sunday, August 2nd, 2020, 09:44:47 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంటికి ఆగంతకులు రావడం పట్ల తీవ్ర ఆందోళనకు గురి అయిన కుటుంబ సభ్యులు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దుండగులు వచ్చి బెదిరించడం తో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. Ap 31 a n 0004 కారు లో వచ్చి బెదిరించిన వారి పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పోలీసులు ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన కార్ నంబర్ ఆధారంగా వారిని పట్టుకున్నారు పోలీసులు. అయితే మోహన్ బాబు ఇంటికి వచ్చినటివంటి ఆగంతకులు మైలార్ దేవ్ పల్లి లోని దుర్గా నగర్ కి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. అయితే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా వారిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ యువకులు ఎవరు, వారి వెనుక ఎవరూ ఉన్నారు, ఎవరు పంపించి ఉంటారు, వారే కావాలని వచ్చారా అని వాటి పై పోలీసులు ఆరా తీస్తున్నారు.