ఆ హీరోయిన్ కు అదేం ఖర్మ?

Thursday, August 27th, 2015, 04:05:37 PM IST

neetu
నకిలీ పాత్రలతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన కేరళ నటికి యూఎస్ కాన్సులేట్ లో చుక్కెదురైంది. కాగా కేరళ రాష్ట్రం పత్తనందిట్టకు చెందిన 28ఏళ్ళ మలయాళ నటి నీతూ కృష్ణవాసూ అమెరికా వెళ్లేందుకు వీసా కోరుతూ చెన్నై అమెరికన్ కాన్సులేట్ కు విచ్చేసింది. కాగా ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో అధికారులు రాయపేట పోలీసులకు పిర్యాదు చేశారు. దీనితో ఆమెతో పాటు ఆమె అనుచరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక విచారణలో నీతూ కృష్ణ అనేక విషయాలను వెల్లడించింది. ఈ మేరకు రాజీ అనే సినిమా నిర్మాత తనను సంప్రదించి అమెరికాలో జరిగే వివాహాలకు డాన్సులు చేస్తే బోలెడు డబ్బులు సంపాదించవచ్చునని తెలిపాడని వివరించింది. అలాగే వీసా ఖర్చులకు 2లక్షలు అవుతుందని రాజీ చెప్పగా తాను ఆ మొత్తాన్ని అతనికి అందజేశానని, తనను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదని ఈ మలయాళ కుట్టి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పోలీసులు రాజీ, ఈ కేసులో మరో ముఖ్య వ్యక్తి కుంజుమోన్ ల కోసం గాలింపు మొదలెట్టారు.