వకీల్ సాబ్ లోని “పవన్ – శృతి హాసన్” ల ఫోటో లీక్

Monday, December 21st, 2020, 09:44:17 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళినప్పటినుండి ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియో లు ఇప్పటికే లీక్ అయ్యాయి. చిత్ర యూనిట్ ఎంతగా జాగ్రత్త వహించినప్పటికి లీకులు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయవాది గెటప్ కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి ఈ చిత్రం నుండి ఒక ఫోటో లీక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ శ్రుతి హాసన్ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ లు ఇద్దరు ఒకరి చేయి మరొకరు పట్టుకొని ఉన్న ఫోటో బయటికి రావడం పట్ల టీమ్ అసహనం వ్యక్తం చేస్తోంది.

అయితే వీరిద్దరూ కలిసి ఇప్పటికే గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో నటించారు. కాగా ఈ చిత్రం లో మరొకసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పింక్ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు, బోని కపూర్ తో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా, దర్శకత్వం వేణు శ్రీరామ్. ఈ చిత్రం నుండి విడుదల అయిన మగువ మగువ అనే పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.