ఆసక్తి రేపుతున్న కీర్తి సురేష్ పెంగ్విన్ ట్రైలర్!

Thursday, June 11th, 2020, 05:08:09 PM IST

Penguin

మహానటి చిత్రం తో ఛాలెంజింగ్ రోల్స్ కి స్వాగతం పలికిన నటి కీర్తి సురేష్ మరొక సారి తన అద్భుత పెర్ఫారమెన్స్ ను కనబర్చినట్లు తెలుస్తోంది. పెంగ్విన్ ట్రైలర్ ను గురువారం నాడు విడుదల చేయగా విశేష ఆదరణ లభిస్తోంది. తల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. తన కుమారుడు అజయ్ 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న అడవిలో తప్పి పోతాడు. అయితే కొన్ని రోజుల పాటు అజయ్ కనిపించకుండా ఉంటాడు. అయితే అతని కొడుకు కి ఏమైంది, అని కనుగొనేందుకు కీర్తి సురేష్ ఎంతగానో ప్రయత్నిస్తుంది.

అయితే ఒక సైకో పిల్లల్ని చంపుతూ అడవిలో తిరగడం తో ట్రైలర్ ఇంకాస్త థ్రిల్లింగ్ గా కొనసాగింది. అయితే ఈ చిత్రం లో తన కుమారుడిని కీర్తి సురేష్ కనుక్కుందా లేదా, ఆ సైకో ను ఏం చేశారు అనేది పెంగ్విన్ కథ అని ట్రైలర్ లో క్లియర్ కట్ గా తెలుస్తోంది. అయితే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ట్రైలర్ సైతం ఆసక్తి రేపుతోంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠ గా కొనసాగడం తో ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ అభిమానులు మాత్రమే కాక, ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్ర ట్రైలర్ ను తెలుగు లో నాని, తమిళ్ లో ధనుష్, మలయాళం లో మోహన్ లాల్ విడుదల చేశారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటీ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా జూన్ 19 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.