హాట్ టాపిక్: మెహర్ రమేష్, మెగాస్టార్ చిరంజీవి ల చిత్రాన్ని అనౌన్స్ చేసిన పవన్

Thursday, September 3rd, 2020, 08:27:55 PM IST


పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పలువురు కీలక వ్యక్తులు పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికీ కూడా రిప్లై ఇస్తూ, తిరిగి వారిని విష్ చేస్తున్నారు. అయితే దర్శకుడు మెహర్ రమేష్ సైతం పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు పవన్ కళ్యాణ్ బదులుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

థాంక్ యూ రమేష్, చిరంజీవి తో నువ్వు తీయబోయే చిత్రానికి శుభాకాంక్షలు అంటూ బదులు ఇచ్చారు. అయితే ఇప్పటికీ వీరు దీని పై అధికారిక ప్రకటన చేయలేదు. నేను చిరంజీవి మెహర్ రమేష్ తో సినిమా చేయనున్నారు అనే వార్తలు వచ్చాయి, అయితే వాటిని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు.అయితే మెగా అభిమానులు ఈ న్యూస్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న pspk 27, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న pspk 28 మరియు pspk 29 సినిమా లకు సంబంధించిన అప్డేట్స్ రావడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.