సంక్రాంతి కి వకీల్ సాబ్ టీజర్…సంతోషంలో అభిమానులు!

Friday, January 1st, 2021, 08:32:30 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. అయితే ఈ చిత్రం విడుదల పై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ నూతన సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను సంక్రాంతి పండుగ రోజున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన తో పాటుగా పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ లు జంటగా బైక్ పై ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ తో రొమాంటిక్ యాంగిల్ లో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ చిత్రం తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. బాలీవుడ్ నాట ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, నటి అంజలి తో పాటుగా పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సమ్మర్ కి ఈ చిత్రం ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.