మెగా హీరోలకు థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Saturday, September 12th, 2020, 03:01:41 PM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను ఇటీవల అభిమానులు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పవన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే చనిపోయిన ఒక్కో కుటుంబాలకి తన వంతు సాయంగా పవన్ రెండు ల‌క్షల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందచేశారు.

అయితే మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక‌సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ ఒక్కొక్కరి కుటుంబానికి రెండు రెండు లక్షలు ఇవ్వగా, రామ్ చరణ్ రెండున్నర లక్షలు ఇచ్చారు. అయితే దీని పట్ల పవన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వారిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే మెగా హీరోలతో పాటు మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు మరియు మరికొంత మంది కూడా చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక‌సాయం అందించడంత్గో వారికి కూడా పవన్ ధన్యవాదాలు తెలియచేశారు.