ఆది “శశి” ట్రైలర్ ను విడుదల చేసిన పవర్ స్టార్

Wednesday, March 10th, 2021, 02:23:27 PM IST

ఆది, సురభి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం శశి. అయితే ఈ చిత్రం ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఉదయం విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆది మరియు సురభి ల డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఏదైనా మనం సాధించాలి అని అనుకున్నప్పుడు ముందు మన బలహీనత లను గెలవాలి అంటూ ఆది చెప్తున్న డైలాగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు, ఉన్న చోట నిలబెట్టుకోవడం అంటూ చెప్పే డైలాగ్ ఇటు యువత ను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం లోని ఒకే ఒక లోకం నువ్వే అనే పాట పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేయడం తో, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ట్రైలర్ ను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆది కి ప్రత్యేక విషెస్ తెలుపుతున్నారు. ఈ చిత్రం మార్చి 19 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.