నెట్టింట్లో వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్..!

Friday, February 26th, 2021, 09:29:51 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని మాస్ అండ్ పవర్ ఫుల్ లుక్ లో క్రిష్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రీ లుక్ తోనే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటో చూస్తుంటే పవన్ కళ్యాణ్ గెటప్ అండ్ స్టైల్ తో ఇండస్ట్రీ పై దండయాత్ర చేయడం ఖాయం అని అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో దొంగ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను మార్చి 11 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా, మరోక హీరోయిన్ పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ వీటి తో పాటుగా, అయ్యప్పనుం కోషియాం చిత్రం రీమేక్ లో, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా లు చేస్తున్నారు.