ట్రెండ్ అవుతున్న వకీల్ సాబ్ ‘కంటి పాప’ సాంగ్..!

Thursday, March 18th, 2021, 01:21:34 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మగువ మగువ, సత్యమేవ జయతే అనే రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట వచ్చేసింది. కంటి పాప.. కంటి పాప.. అంటూ సాగే మూడో పాటని చిత్ర బృందం నేడు సాయంత్రం విడుదల చేసింది. అయితే పవన్‌, శృతిల మధ్య ప్రేమ సన్నివేశాల్లో ఈ పాట వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రచించగా, బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ పాడారు. సాంగ్‌ రిలీజ్‌ అయిన కాసేపట్లోనే వేల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.