నీహారిక పెళ్లి వేడుకల్లో పవన్…ఫోటో షేర్ చేసిన నాగబాబు

Wednesday, December 9th, 2020, 08:30:25 AM IST

మెగా డాటర్ నీహారిక – చైతన్య పెళ్లి వేడుకల్లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు బిజీగా ఉండటం వలన ఫ్యామిలీ కి కాస్త దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉదయ్ పూర్ చేరుకున్న విషయాన్ని సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే తమ్ముడు వచ్చాడు అంటూ నాగబాబు పోస్ట్ చేసిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పవన్ తో పాటుగా అకిరా కూడా పెళ్లి వేడుకలకు హజరు అయ్యారు. అయితే పెళ్లి వేడుకల్లో అందరూ కలిసి దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

డిసెంబర్ 9 వ తేదీన సాయంత్రం 7:15 గంటలకు నీహారిక చైతన్య ల వివాహం జరగనుంది. అయితే వీరి వివాహం ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో జరగనుంది. అయితే పెళ్లి వేడుకల్లో అటు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ లు పాల్గొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం పెళ్లి వేడుకలకు హజరు కానున్నారు.