హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ రిలీజ్.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్..!

Thursday, March 11th, 2021, 08:00:19 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే చెప్పినట్టుగానే మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ లుక్‌ను, సినిమా టైటిల్‌ను చితృ బృందం విడుదల చేసింది. పీరియాడికల్‌ నేపథ్యంలో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

అయితే రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా పవన్ ఉండబోతున్నాడట. అందులో భాగంగానే పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ తరహా లుక్‌తో పవన్‌ కళ్యాణ్ నుంచి ఇంత వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ లుక్ చూసిన పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా స్పెషల్ రోల్‌లో కనిపించనున్నదని టాక్. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతోన్న ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి