వారికి నేనే బిడ్డగా నిలుస్తా.. అభిమానుల మృతిపై స్పందించిన పవన్..!

Wednesday, September 2nd, 2020, 07:30:55 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలోనే కాదు యావత్ జనసైనికులకు ఇది తీవ్ర విషాదం అనే చెప్పాలి. ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ గుండెల నిండా తనపట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

అయితే ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనని, ఇకపై వారికి నేనే బిడ్డగా నిలుస్తానని అన్నారు. అంతేకాదు ఆర్థికంగా వారి కుటుంబాలను కూడా తానే ఆదుకుంటానని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు జనసైనికులకు మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్థానిక నాయకులకు సూచించారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.