ఈ చిత్రం లో పవన్ లుక్ ఒక రేంజ్ లో ఉండనుందా?

Tuesday, February 9th, 2021, 08:46:29 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఏక కాలంలో వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ టిలోనూ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే నే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ కి మొదటి నుండి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అంతేకాక పవన్ కళ్యాణ్ కి చెందిన ప్రి లుక్ విడుదల అయినప్పటి నుండి ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు అనే దాని పై సర్వత్రా చర్చ లు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని లుక్ లో కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ హార్స్ రైడింగ్ చేయడం కొత్త కాకపోయినప్పటికీ క్రిష్ ఈ సినిమా లో చాలా పవర్ ఫుల్ గా చూపించ నున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ లుక్ కచ్చితంగా అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది అంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇంట్రడక్షన్ సీన్ సైతం మరింత పవర్ ఫుల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, మరోక హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.