పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండీషన్ కి ఓకే చెప్పిన “వకీల్ సాబ్” చిత్ర యూనిట్!

Friday, September 18th, 2020, 01:49:35 AM IST

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ చిత్రం మరింత ఆలస్యం అవుతుంది. దాదాపు రెండేళ్ల సమయం తర్వాత మేకప్ వేసుకొని మళ్ళీ నటిస్తున్న పవన్ కళ్యాణ్, కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ అన్ లాక్ ప్రక్రియ లో బాగంగా పలు సినిమాల చిత్రీకరణ పునః ప్రారంభం అయింది. ఈనేపధ్యంలో పవన్ కళ్యాణ్ ను వకీల్ సాబ్ చిత్ర యూనిట్ సంప్రదించింది.

అయితే త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి పవన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం కుదరదు. పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష లో ఉన్నారు. అయితే సాయంత్రం ఆరు గంటలకు పవన్ ఈ దీక్ష మొదలు పెడతారు. అయితే సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటా అని చిత్ర యూనిట్ కి పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల అయిన ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.