హ్యాట్.. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

Wednesday, September 2nd, 2020, 10:06:57 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న వ‌కీల్ సాబ్‌కి మూవీకి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది. సత్యమేవ జయతే అంటూ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఒక చేతిలో క్రిమినల్ లా పుస్తకాన్ని పట్టుకుని మరో చేత్తో కర్రను పట్టి నిల్చున్న పవన్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుందనే చెప్పాలి.

అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కావడంతో ఈ సారి టీజర్ విడుదల కాబోతుందంటూ ప్రచారం జరిగినా మేకర్స్ మాత్రం మోషన్ పోస్టర్‌తో సరిపెట్టేశారు. ఇదిలా ఉంటే దాదాపు రెండేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు మరియు బోణీ కపూర్ కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.