పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా మరొక బిరుదు!?

Thursday, July 16th, 2020, 02:47:02 AM IST

పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జూలై 13 న అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అనే హష్ ట్యాగ్ తో సోషల్ మీడియా లో అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు. ఇప్పటి వరకు లేని రికార్డ్ ను సైతం కొల్లగొట్టారు. అయితే రికార్డ్ ఏదైనా కానీ పవన్ తనకు తన ఉనికి ను సోషల్ మీడియా లో ఎక్కువగా చాటుకుంటున్నారు. తాజాగా 27.1 మిలియన్ త్వీట్స్ తో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, ఇది ఇంకా ట్రైలర్స్ మాత్రమే, పుట్టిన రోజు కి మరో ట్రెండ్ క్రియేట్ చేస్తాం అంటూ అభిమానులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ను ట్రెండింగ్ స్టార్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ అంటూ వ్యాఖ్యానించడం పట్ల అభిమానులు సైతం ఖుషి ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక, రెండేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గాక ధియేటర్ లోకి రావడం పక్క. ఏదేమైనా పవన్ ఇటు రాజకీయాల్లో, సినిమా ల్లో తన సత్తా చాటుతూ సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ అయ్యారు.