పవన్ కళ్యాణ్ అభిమానులకు సిసలైన పండుగ…మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్!

Sunday, October 25th, 2020, 12:15:29 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి విజయ దశమి పండుగ రోజున మరొక శుభవార్తను అందించింది సితార ఎంటర్టెన్మంట్స్. పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేసేసింది. ప్రొడక్షన్ నంబర్ 12 లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ చిత్రానికి ఇంకా ఎటువంటి టైటిల్ ను పెట్టలేదు. కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటూ పవన్ ను ప్రెసెంట్ చేస్తూ, హై ఓల్టేజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ ను చూపించ నున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా, సాగర్ కే. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు ఇతను అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి దర్శకత్వం వహించారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుండగా, క్రిష్ మరియు హరీశ్ శంకర్ లతో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాత గా పవన్ తో సినిమా చేయనున్నారు. ఇప్పటికే వరుస సినిమా లతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం లో ఉండగా, ఇప్పుడు సితార ఎంటర్టెన్మంట్స్ అనౌన్స్మెంట్ తో సిసలైన పండుగ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పుట్టిన లుక్ లేకుండానే కేవలం షాడో తో ప్రెసెంట్ చేయడం హైలెట్.