వైరల్ బజ్ : పవన్ సినిమాకు ఈ హీరోయిన్ వద్దంట.!

Thursday, April 2nd, 2020, 07:04:06 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ “వకీల్ సాబ్” అలాగే క్రిష్ దర్శకత్వంలో “విరూపాక్ష” అనే మరో భారీ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వెతికి తర్వాత కూడా పవన్ బాగా బిజీగా ఉండబోతున్నారు. ఇప్పటికే తన హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా ఒక అదిరిపోయే సినిమాను చేస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసారు.

కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ అప్డేట్ ను హరీష్ చెప్పకనే చెప్పేసారు. పవన్ తో చేస్తున్న సినిమాలో పూజా హెగ్డేను ఫిక్స్ చేస్తున్నట్టు తెలిపారు. దీనితో పవన్ ఫ్యాన్స్ కు ఇది అంతగా నచ్చలేదు. హరీష్ పెట్టిన ఈ ట్వీట్ కు గాను పవన్ ఫ్యాన్స్ నుంచి ఎక్కువ నెగిటివిటినే వచ్చింది. పవన్ సరసన పూజా వద్దని వేరే ఎవరినైనా పెట్టండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతీ దాన్ని బాగా పరిశీలించే హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.