‘బన్నీ’ కోసం ‘పవన్ కళ్యాణ్’ ను కావాలనే తొక్కేస్తున్నారట..!

Sunday, July 3rd, 2016, 09:35:31 PM IST


ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో అవార్డుల గొడవ మరీ ఎక్కువవుతోంది. అభిమానులైతే కావాలనే తమ హీరోని తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన సైమా అవార్డుల కార్యక్రమంలో స్పెషల్ క్యాటగిరీలో అవార్డుల ఎంపికలో రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు గాను బన్నీకి అవార్డును ప్రకటించారు నిర్వాహకులు. ఈ అవార్డును కూడా ఎటువంటి పోటీ లేకుండా ప్రకటించేశారు. దీంతో అసలే బన్నీపై కాస్త గుర్రుగా ఉన్న పవన్ అభిమానులు 2015 లో ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనబరిచాడని, అలాంటి చిత్రాన్ని కనీసం పోటీకి కూడా తీసుకోకుండా బన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, కావాలనే బన్నీని హైలెట్ చేయడం కోసం పవన్ ను తొక్కేస్తున్నారని అభిమానులు ఆగ్రహిస్తున్నారు.