ప్రారంభమైన పవన్ క్రిష్ ల సినిమా షూటింగ్

Tuesday, January 12th, 2021, 09:32:00 AM IST

కరోనా వైరస్ కారణంగా అనుకున్న సమయానికి కాకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి సినిమా షూటింగ్ లు. అయితే కరోనా వైరస్ భారిన పడిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం నాడు ప్రారంభం అయింది. ఈ సినిమా ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు క్రిష్. భిన్నమైన కథలతో సినిమా కి ప్రాణం పోసే క్రిష్. చివరగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి ఆకట్టుకోలేక పోయాడు.

పవన్ కళ్యాణ్ సైతం వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లో నటించేందుకు సిద్దం అయ్యారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 25 రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ను డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారు కృష్. ఈ చిత్రానికి విరూపాక్ష అని టైటిల్ పరిశీలన లో ఉంది.