ప్రభాస్ “ఆదిపురుష్” మోషన్ క్యాప్చర్ బెగిన్స్..!

Tuesday, January 19th, 2021, 10:30:29 AM IST

ఓం రౌత్ దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా ఆది పురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఆడిపురుష్ చిత్రం మోషన్ క్యాప్చర్ ను సిద్దం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఓం రౌత్ తన టీమ్ తో కలిసి దిగిన ఫోటో ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదిపురుష్ చిత్రం లో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నారు. రావణాసురుడు పాత్ర లో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.

అయితే ఈ చిత్రం లో కథానాయిక విషయం లో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆదిపురుష్ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మోషన్ క్యాప్చర్ త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఓం రౌత్ చేసిన ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడం తో, అటు సలార్ చిత్రం ను కూడా మొదలు పెట్టాడు. ఇటు ఆదిపురుష్ లో కూడా ఏక కాలంలో నటిస్తూ పాన్ ఇండియా చిత్రాలు చేయడం ఒక్క ప్రభాస్ కే చెల్లింది అని చెప్పాలి.