ఎన్టీఆర్ తో సినిమాను కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ నీల్!

Thursday, May 20th, 2021, 03:33:59 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రముఖులు అంతా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యం లో ఎన్టీఆర్ మరొక చిత్రానికి సంబంధించిన అప్డేట్ తాజాగా వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే నేడు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్టీఆర్31 వర్కింగ్ టైటిల్ గా ఉన్నది.అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తో పాటుగా, ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల అనంతరం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుధిరం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనంతరం కొరటాల శివ దర్శకత్వం లో మరొక చిత్రాన్ని చేయనున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ప్రశాంత్ నీల్ తో పని చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన తో నే భారీ అంచనాలు పెరిగిపోయాయి.