ఎన్‌టీఆర్ హోస్ట్‌గా మరో రియాలిటీ షో ప్లాన్.. నిజమేనా?

Sunday, December 13th, 2020, 12:00:24 AM IST

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1 కు హోస్ట్‌గా చేసిన జూనియర్ ఎన్‌టీఆర్ తన యాక్టింగ్, యాంకరింగ్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ఎన్‌టీఆర్ సిద్దమవుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా ఓ రియాల్టీ షోను ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

అయితే ఇప్పటికే ఈ రియాల్టీ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌ కూడా వేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.