తారక్ ఫ్యాన్స్ “కొమరం భీమ్” టీజర్ చూసేది అప్పుడేనా!?

Tuesday, September 22nd, 2020, 02:13:21 AM IST

NTR still from RRR Movie
టాలీవుడ్ లో మోస్ట్ అవైటడ్ మూవీ గా రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న రౌద్రం రణం రుధిరం ఉంది. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ నటిస్తుండటం తో ఈ సినిమా ను అనౌన్స్ చేసినప్పటి నుండే విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజన భీం ఫర్ రామరాజు అంటూ విడుదల అయిన టీజర్ అభిమానుల అంచనాలకి మించి ఉంది. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తారక్ కి సంబంధించిన టీజర్ ఇంకా విడుదల కాలేదు.

అయితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ విడుదల ఉంటుంది అంటూ చిత్త యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే వచ్చే నెల లాక్ డౌన్ సడలింపు కారణంగా చిత్ర షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దసరా పండుగ కి ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జక్కన్న మరియు కీరవాణి లు సైతం దీని పై ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అన్ని కుదిరితే తారక్ అభిమానులు కొమరం భీమ్ టీజర్ ను దసరా పండుగ రోజున చూసే అవకాశం ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.