డై హార్డ్ ఫ్యాన్‌కు వీడియో కాల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్..!

Tuesday, November 3rd, 2020, 11:07:13 PM IST

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ఏం చేయడానికైనా ముందుంటాడు. అయితే తాజాగా ఓ అభిమాని కోరికను తీర్చి అతడికి నేనున్నానన్న ధైర్యాన్ని నింపాడు. నల్లగొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన వెంకన్న జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనకు ఓ ప్రమాదం జరగడంతో స్పైనల్ కార్డు దెబ్బతింది. అయితే జీవితంలో ఎన్టీఆర్‌ను ఒకసారైనా కలిసి ఫోటో దిగాలన్న కోరిక వెంకన్నలో బాగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చేందుకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు.

అయితే జూనియర్ ఎన్‌టీఆర్ ఫోన్ చేసి మాట్లాడడంతో ఆ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. కరోనా సాధారణ స్థితికి వచ్చాక తాను తప్పకుండా అతడిని కలిసి సెల్ఫీ దిగుతానని, అంతేకాకుండా నా వంతు సాయం నేను చేస్తాను, మీరు నిశ్చితంగా అతడిని చూసుకోమని తల్లిదండ్రులకు జూనియర్ ధైర్యం చెప్పాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ RRR చిత్రంలో బిజీగా ఉన్నారు.