అభిమానుల కోసం భావోద్వేగ భరిత పోస్ట్ ను షేర్ చేసిన ఎన్టీఆర్

Thursday, May 21st, 2020, 01:01:48 AM IST

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు,.సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే జూనియర్ తన అభిమానుల కోసం ఒక భావోద్వేగ భరిత పోస్ట్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్ట లేనిది అని వ్యాఖ్యానించారు.అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం అని అన్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకో గలను అని అన్నారు. ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను అని వ్యాఖ్యానించారు. చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా మునుపెన్నడూ లేని విధంగా రెచ్చిపోయారు. దాదాపు #happybirthdayntr హాష్ ట్యాగ్ నీ ట్రెండ్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.