మహేష్ మరో క్లీన్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారా..?

Sunday, February 23rd, 2020, 07:29:11 PM IST

బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లు అందుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన మలి చిత్రాన్ని మొదలు పెట్టడానికి కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు.అయితే మహేష్ తాను నటించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం తర్వాత మళ్ళీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తారని వార్తలు కూడా వినిపించాయి.కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.వంశీ కు ఇచ్చిన సమయంలో స్క్రిప్ట్ పని పూర్తి చేయకపోవడం మూలన మహేష్ తన 28 వ సినిమాకు అవకాశం ఇస్తారని తెలిపినట్టి తెలుస్తుంది.

దీనితో ఇప్పుడు మహేష్ సినిమాను తెరకెక్కించే అవకాశాన్ని పరశురాం దక్కించుకున్నారు.ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా క్లీన్ హిట్ అవుతుంది అని చెప్పాలి. ఇప్పటికే తీసిన “గీత గోవిందం”, “శ్రీరస్తూ శుభమస్తు” వంటి సినిమాలను తీసి భారీ విజయాలను అందుకున్నారు.ఫ్యామిలీ ఆడియెన్స్ కు పరశురాం సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చాయి.ఈ లెక్కన ఈసారి మహేష్ ఖాతాలో మరో మంచి క్లీన్ హిట్ పడడం ఖాయం అని చెప్పాలి.