అవును… ఓటిటి ప్లాట్ ఫాం లోనే నిశ్శబ్దం చిత్రం విడుదల

Thursday, September 17th, 2020, 02:05:14 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణం గా అన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే రెండేళ్ల షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్దం చిత్రం మాత్రం ఈ ఏడాది ఆరంభంలో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వలన వాయిదా పడింది. అయితే కరోనా వైరస్ ఈ చిత్రానికి గట్టి దెబ్బ వేసింది అని చెప్పాలి. అనుశ్క, మాధవన్, అంజలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఎట్టకేలకు ఓటిటి ద్వారా విడుదల కానుంది.

అయితే ఈ చిత్రం ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫాం లో విడుదల కావడం పై ఈ చిత్ర దర్శక నిర్మాతలు స్పందించారు. అవును.. ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే నిశ్శబ్దం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు హేమంత్ మధుకర్ తెలిపారు.ధియేటర్ లలో విడుదల చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా, పరిస్థితులు తమ చేతిలో లేవు అని, థియేటర్లు ఎప్పుడు పునః ప్రారంభం అవుతాయో తెలీదు అని, అందుకే ఓటి టి కరెక్ట్ అని ఫీలయ్యామని తెలిపారు. అయితే నిర్మాత కోన వెంకట మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ధియేటర్ లో విడుదల చేయడం మొదటి ప్రాధాన్యం అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ రోజుల పాటు వాయిదా వేయడం కుదరడం లేదు అని, రెండేళ్ల కి పైగా కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ను ఇలా విడుదల చేయడం బాధ గా ఉంది అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది.