‘హిరణ్య కశ్యప’ కోసం త్రివిక్రమ్ తో పాటు మరో స్టార్ రైటర్ కూడా ?

Friday, December 25th, 2020, 10:30:12 PM IST

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రగా రాబోతున్న భారీ ప్రాజెక్ట్ చిత్రం ‘హిరణ్య కశ్యప’. కాగా ఈ చిత్రానికి సంభాషణలు రాయమని గుణశేఖర్ కోరడంతో త్రివిక్రమ్ డైలాగ్స్ రాయటానికి అంగీకరించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మైథలాజికల్ సబ్జెక్ట్స్ కోసం మరో స్టార్ రైటర్ కూడా పని చేయబోతున్నాడు. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నట్లు తెలుస్తోంది. సాయి మాధవ్ కి పురాణ పాత్రల మీద మంచి పట్టుంది.

ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి తరువాత ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్స్ కూడా స్టూడియోలో మొదలైయాయి. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం కొన్ని ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. అయితే పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తిగా రెడీ చేసుకున్న తరువాతే షూటింగ్ కి వెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మొత్తానికి హిరణ్య కశ్యప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.