హాట్ టాపిక్ : టాలీవుడ్ లో స్టార్ట్ అయిన నయా ట్రెండ్.!

Sunday, June 28th, 2020, 11:37:55 PM IST

ఇప్పుడు కరోనా దెబ్బకు మన టాలీవుడ్ లో గడ్డు కాలం నడుస్తుంది అని చెప్పాలి. షూటింగ్స్ లేక సినిమాలు విడుదల కాక తమ అభిమాన హీరోల నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ లేకపోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ నిరాశలో ఉన్నారు.

అయితే ఇదే సందర్భంలో మన టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అదే అన్ సీన్ పిక్స్ ట్రెండ్. గత కొన్ని రోజుల నుంచి మన తెలుగు స్టార్ హీరోల గత చిత్రాల నుంచి ఇంత వరకు ఎవరూ ఎప్పుడూ చూడని స్టిల్స్ ను విడుదల చేస్తున్నారు.

దీనితో కొత్త సినిమాల్లో ఫస్ట్ లుక్ పోస్టర్స్ రాకపోయినా ఈ అన్ సీన్ పిక్స్ తో మాత్రం ఫుల్ ఖుషి అయ్యిపోతున్నారు. వీటిలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నవి మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా నుంచి పోలీస్ గెటప్ లో ఉన్న పోస్టర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “అజ్ఞ్యాతవాసి” లోని పోస్టర్స్ మంచి వైరల్ అయ్యాయి.