పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్న మహేష్ “సర్కారు వారి పాట”…కానీ!

Friday, September 18th, 2020, 02:02:19 AM IST


మహేష్ బాబు కెరీర్ లో ప్రతి ఒక్క సినిమా పై కూడా ఎంతో శ్రద్ద చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు. తీసే ప్రతి సినిమా కూడా ఒక ల్యాండ్ మార్క్ అయ్యేలా, సందేశాత్మక చిత్రం తో పాటుగా, ఎంటర్టైన్మెంట్ ను కూడా జోడిస్తున్నారు. ఇప్పటికే సరిలేరు నీకేవ్వరూ అంటూ ఈ ఏడాది ఒక బ్లాక్ బస్టర్ తో అదరగొట్టిన మహేష్ బాబు, సర్కారు వారి పాట కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణం గా ఈ చిత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

అయితే దర్శకుడు పరశురామ్ తో మొదటిసారిగా మహేష్ బాబు పని చేస్తున్నారు. కథ, కథనం బాగా నచ్చడం తో మహేష్ బాబు ఈ చిత్రం ను ఓకే చేశారు. ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అభిమానుల అంచనాలను పెంచేసింది. అయితే ఈ చిత్రానికి మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించేందుకు ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి. అయితే ఈ చిత్రం లో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పక్కా ప్లాన్ తో షూటింగ్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కూడా కీలకం కావడం తో, ప్రస్తుతం ఈ పాత్ర పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి మహేష్ సరసన నటించే ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.