బిగ్ న్యూస్: బండ్ల గణేష్ పోస్ట్ పై నెటిజన్ దిమ్మ తిరిగే ప్రశ్న!

Monday, April 6th, 2020, 07:52:26 PM IST

బండ్ల గణేష్ తన ఆవేదనని ట్విట్టర్ పోస్టుల ద్వారా ప్రజలకు తెలియజేశారు. అయితే కోళ్ల పరిశ్రమ అంటే చికెన్ కి సంబంధించిన కోడి కాదు కోడి రైతు అంటే కోడిగుడ్లు అమ్ముకునే వాడని రైతు అంటారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక, కోట్ల నష్టాల్లో లేయర్ కోడి రైతు గుడ్డు పెట్టి ఇచ్చే పత్తి కోడి రైతు కష్టాల్లోనే ఉన్నారు అని అన్నారు. ఈరోజు మా ఉత్పత్తి ధర నాలుగు రూపాయల 20 పైసలు అవుతుంది అని వ్యాఖ్యానించారు. అయితే
మాకు మాత్రం రెండు రూపాయల ఎనభై పైసల నుంచి మూడు రూపాయలు మాత్రమే వస్తుంది అని అన్నారు. మా నష్టాన్ని దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నించండి అని అన్నారు.

అయితే బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం బండ్ల గణేష్ నీ సూటిగా ప్రశ్నించారు. ఫార్మ్స్ అన్నీ పోయినా మీరేం అడుక్క తినరు లెండి అని అన్నారు. ఇదే సమస్య రైతుకి వచ్చినప్పుడు ఎవడు ముందుకు రాడు,
రైతులు పండించిన ధాన్యాన్ని కొని మీలాంటి బడా వ్యాపారులు మాత్రం పాలిష్ మీద పాలిష్ వేసి రకరకాల పేర్లు పెట్టీ 1000రూపాయల బస్తాని 1500 కి అమ్ముతారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేచింది ఏ అంటూ దిమ్మ తిరిగే ప్రశ్న వేశారు.