బండ్ల గణేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Thursday, July 16th, 2020, 09:29:45 AM IST

“మనిషిగా పుట్టి ఎంత సంపాదించావ్ అన్నది కాదు ఎలా బ్రతికావ్ అన్నది ముఖ్యం” అనే ఈ మాటకు సరితూగే వారు చాలా తక్కువ మందే ఉంటారు. సాటి మనిషికి సాయం చెయ్యకపోతే ఎంత సంపాదించి ఏం లాభం? కానీ ఇలాంటి వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన ఉదారత చాటుకుంటున్నారు.

మాట ఎంత అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం వెన్నపూసే అని మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎవరికైనా కష్టం ఉంది అని తెలిస్తే అది తన కష్టంగా భావించి ఎలాంటి ఆలోచన లేకుండా ఆ సమస్యను లెవనెత్తి తాను సాయం చెయ్యడం మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు వరకు తన దృష్టికి వచ్చిన సమస్యను చేరవేసే వారధిగా మారారు.

ఇప్పుడు కూడా ఓ జనసేన కార్యకర్తకు తీవ్రమైన కరెంట్ యాక్సిడెంట్ కావడంతో వెంటనే వారి గూగుల్ పే నెంబర్ అడిగి ఆర్ధిక సాయం చెయ్యడానికి ముందుకొచ్చారు. దీనితో బండ్ల గణేష్ దయా హృదయానికి నెటిజన్స్ హ్యాట్సాప్ చెప్తున్నారు.