తొలి సినిమా తోనే రికార్డ్ సెట్ చేసిన ప్రదీప్

Monday, April 6th, 2020, 02:36:28 PM IST


బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ చాలా తక్కువ సమయంలో నే మంచి పాపులారిటీ సంపాదించారు. చాలా ఆదరణ కలిగివున్న ప్రదీప్ సినిమా లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేస్తున్న ప్రదీప్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రం తో వెండి తెర పై హీరోగా కనిపించ నున్నారు. అయితే ఈ చిత్రం మున్నా దర్శకత్వంలో తెరకక్కిస్తున్నారు. అమృత కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి చాలా తక్కువ కాలం లోనే ఎక్కువ పేరు వచ్చింది. మార్చి లో విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమా నుండి విడుదల అయిన నీలి నీలి ఆకాశం పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాట 100 మిలియన్ వ్యూస్ నీ రాబట్టింది. ఒక డెబ్యూ హీరో కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం పట్ల సినీ వర్గాల్లో సైతం ఆసక్తి మొదలైంది. చంద్రబోస్ రాసిన ఈ పాటని, సిద్ శ్రీరామ్, సునీత పాడారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.