సుధీర్ – నాని ల “వి” డైరెక్ట్ ఓటిటీ గా ప్రైమ్ వీడియో లో!?

Thursday, August 13th, 2020, 01:12:39 AM IST


మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకక్కుతున్న వి చిత్రం షూటింగ్ పూర్తి అయి విడుదల కి సిద్దంగా ఉంది. చిన్న చిత్రాలను భారీ కమర్షియల్ హిట్ గా మార్చగల నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం విడుదల పై పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటి టి ద్వారా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రం పై చాలా పుకార్లు షికారు చేశాయి. నాని నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు. హీరోగా సుధీర్ బాబు డిఫెరెంట్ స్టైల్ లో అదరగొట్టానున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ధియేటర్ లోనే విడుదల చేయాలని భావించిన కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందడం తో ఆన్లైన్ ద్వారా విడుదల చేయడమే కరెక్ట్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ 30 కోట్ల రూపాయల కి పైగా నే కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారం నుండి స్టీమ్ అయ్యే అవకాశం ఉంది.